Header Banner

వైసీపీకి భారీ షాక్.. 15 ఓట్లతో టీడీపీ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నిక! చివరి క్షణంలో..

  Mon Apr 28, 2025 14:46        Politics

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక విజయం దక్కింది. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని టీడీపీ అనూహ్యంగా కైవసం చేసుకుంది. ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో, వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడం ఈ విజయానికి కారణమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఓటింగ్ ప్రక్రియకు ముందు వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ శిబిరానికి చేరుకోవడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దీంతో టీడీపీ బలం ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు, ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి.

 

ఇది కూడా చదవండి: పిన్నెల్లికి బిగ్ షాక్.. మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ!

 

వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. ఈ పరిణామాల మధ్య, 5వ వార్డు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో, ఎంపీడీవో కార్యాలయం వెలుపల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని దక్కించుకోవడం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితం స్థానిక వైసీపీ నాయకత్వానికి ఊహించని షాక్‌గా పరిణమించింది. 

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations